అభిమానికి బ్రెయిన్ ట్యూమర్ – నాగార్జున ఫోన్ కాల్

Tollywood Actor Akkineni Nagarjuna Speaks To His Fan Suffering From Brain Tumor

కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. తమ హీరోలకు అభిమానులంటే ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను… అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నాగార్జున గారు కూడా బ్రెయిన్ ట్యూమర్ తో పోరాడుతున్న తన అభిమానికి ఫోన్ చేసి ఆనందంలో ముంచెత్తారు. అసలు సంగతేంటంటే.. నెల్లూరికి చెందిన లక్ష్మీ అనే మహిళ గతకొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుందట. ఇప్పటికే ఆమెకు మూడు ఆపరేషన్స్ జరుగగా మరికొన్ని నెలల్లో ఫైనల్ సర్జరీకి వెళ్లనున్నారు. అయితే ఆమె నాగార్జునకు పెద్ద ఫ్యాన్ అట. ఇక ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసుకెళ్లారట ఆయన అభిమానులు. ఇక తన అభిమాని అని తెలుసుకున్న నాగార్జున వెంటనే లక్ష్మీకి ఫోన్ చేసి మాట్లాడారు. నాగార్జున తనకు ఫోన్ చేయడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. అక్కినేని ఫ్యామిలీకి తమ కుటుంబమంతా ఫ్యాన్స్ అని.. మీరు కాల్ చేయడం అస్సలు నమ్మలేకపోతున్నా అని ఆనందంలో మునిగిపోయింది లక్ష్మీ.

 

గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.