సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “వర్షం “మూవీ 2004 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ , త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.ఈ మూవీ లో హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా “నువ్వొస్తానంటే “సాంగ్ ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరో ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “వర్షం” 79 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. “వర్షం” మూవీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. “వర్షం” మూవీ పై అవార్డుల వర్షం కురిసింది. 3 నంది , 5 ఫిల్మ్ ఫేర్ , 7 సినీ మా , 10 సంతోషం అవార్డ్స్ గెలుచుకుంది. వరంగల్ వేయి స్థంబాల గుడి , ఫోర్ట్ లొకేషన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “వర్షం” మూవీ హిందీ లో “బాఘీ ” మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. “బాఘీ ” మూవీ తో హీరో సుధీర్ బాబు బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా పరిచయం అవడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























