నితిన్ ‘ఎంగేజ్‌మెంట్‌’ – పెళ్లి వేడుకలు షురూ..!

Wedding Celebrations Begins At Tollywood Actor Nithiin House As He Gets Engaged To Shalini Today

నితిన్-షాలిని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలినిల ప‌సుపు, కుంకుమ వేడుక జ‌రిగింది. ఆ త‌ర్వాత పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో లాక్‌డౌన్ వ‌చ్చిప‌డింది. దీంతో పెళ్లి లేట్ అవుతుండటంతో పెళ్ళిచేసేయాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించారు. ఎంగేజ్‌మెంట్‌తో ఐదు రోజుల పెళ్లి సంబ‌రాలు మొదలయ్యాయి. ఇక విషయ్నాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఎంగేజ్డ్ అంటూ నితిన్-షాలిని ఎంగేజ్మెంట్ ల ఫొటో ను పోస్ట్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు పెళ్లి జరగనుంది. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ ఈ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహిత మిత్రులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పెళ్ళికార్డులు పంచడం కూడా స్టార్ట్ చేసాడు నితిన్.

ప్ర‌స్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.