స్టార్ హీరో సూర్య డిజిటల్ ఎంట్రీ

Star Hero Suriya Debutes In To Digital World Through Web Series Produced By Legendary Director Mani Ratnam

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన “నేరుక్కునేర్ ” మూవీ తో సూర్య సినీకెరీర్ ప్రారంభించారు. సూర్య హీరోగా నటించిన “మౌనం పేసియదే”, “పితా మగన్ “, “గజిని ” , “వారనమ్ ఆయిరమ్ “, సింగం సిరీస్ , “24 “, “కాప్పాన్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “పితా మగన్ ” మూవీ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సూర్య “వారనమ్ ఆయిరమ్ “, “పేరళగన్”, “24 ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సూర్య “రక్తచరిత్ర 2 ” తెలుగు మూవీ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూర్య హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సూరరై పోట్రు ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరో సూర్య ఇప్పుడు లెజెండరీ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న “నవరస ” వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారం కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో 9 కధలు ఉంటాయి. 9 కథ లను 9 మంది దర్శకులు దర్శకత్వం వహిస్తారు. ఈ తొమ్మిది కథ లలో ఒక దానికి సూర్య ఎంపిక అయ్యారు. నవరస ” వెబ్ సిరీస్ లో అరవింద్ స్వామి , సిద్ధార్ధ్ , మరియు ఇతర సినీ ప్రముఖులు నటించనున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ లకు ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.