సినీ పరిశ్రమలో రీమేక్ లు చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు మన భాషల్లో రీమేక్ చేసుకోవడం… మన హిట్ సినిమాలు పక్కన పరిశ్రమ వాళ్లు రీమేక్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ లుగా నిలిచిన నాలుగైదు సినిమాలు రీమేక్ అవుతున్నాయి.. ఇప్పుడు కన్నడలో సూపర్ హిట్ అయిన మరో సినిమా తెలుగులో రీమేక్ కు సిద్ధమైంది. ఆ సూపర్ హిట్ సినిమా ఏదో కాదు ‘లవ్ మాక్ టైల్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఓ క్రేజీ కాంబినేషన్ తో ఈ సినిమా రీమేక్ సన్నాహాలు చేస్తున్నారు. సత్యదేవ్, తమన్నా జంటగా ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎంత వరకు హిట్ అవుతుందో చూద్దాం..
కృష్ణ, మిలన నాగరాజ్ కాంబినేషన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కి ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. నేటి ఉద్యోగుల ప్రేమ, రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమా ద్వారా చూపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వంతో పాటు నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పంచుకున్నాడు. నిధి పాత్రలో నటించిన మిలన నాగరాజ్ ఈ సినిమాకి మరో నిర్మాత.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























