ప్రపంచం అందించే ఉత్తమమైనవి ఇవే..!

Legendary Director K Raghavendra Rao Talks About The Three Important Things In Life In His Recent Tweet On Twitter

ఫిట్ నెస్ కు వయసుతో సంబంధం లేదు. ఎంత ఫిట్ గా ఉంటే అంత యాక్టీవ్ గా.. అంత ఆరోగ్యంగా ఉంటాం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును అది చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ళ నుండి మనం ఆయన్నిచూస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసిన ఒకేలా కనిపిస్తారు. ఆయన వయసు పెరగడం ఆగిపోయిందమేమో అన్నట్టు ఉంటారు ఆయన. ఇక దీనికి కారణం ఆయన ఫిట్ నెస్ మైంటైన్ చేయడం చెప్పొచు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేయగా… దాన్ని చూస్తే నిజమనే అనిపిస్తుంది. తన ఇంట్లోని గార్డెన్ లో ఆయన సైకిల్ తొక్కుతన్న వీడియోను పోస్టు చేశారు. ఈ వయస్సులోకూడా ఆయన ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అంతేకాదు ప్రపంచం మనకు అందించే వాటిలో ఉత్తమైనవి .. ప్రకృతి, ఫిట్ నెస్, నమ్మకస్తుడైన స్నేహితుడు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావుతో పాటు ఆయన పెంపుడు కుక్క కూడా ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మూడు విషయాలు ఆయన ఒకే వీడియోలో చూపిస్తూ మరోసారి ఆయనకు ఆయనే సాటి అని అనిపించుకున్నారు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సంచలన విజయాలు అందించిన రాఘవేంద్రరావు చాలా కాలంగా మరే సినిమాను తెరెకెక్కించలేదు. మెగా ఫోన్ పట్టి చాలా కాలం అవుతుంది. ఆయన చివరి చిత్రం ఓమ్ నమో వెంకటేశాయ. నాగార్జున, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో వచ్చింది. ఈ మూవీ విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తుంది. అయితే గత ఏడాది ఒక సినిమాను ప్రకటించారు. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ సినిమా. అయితే ఇది ఇంత వరకూ పట్టాలెక్కలేదు. ఈ మధ్యనే మళ్లీ ఈ సినిమాపై అప్ డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తామని క్లారిటీ ఇచ్చారు. చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.