తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో ఛాలెంజింగ్ రోల్స్ ఎంపిక చేసుకుని కాజల్ అగర్వాల్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు ” మూవీస్ తో పాటు 2 తమిళ, ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మెడిటేషన్ , యోగా , వర్కౌట్స్, సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ కాజల్ టైమ్ పాస్ చేస్తున్నారు. చాక్లెట్ డే (జులై 7వ తేదీ ) సందర్భంగా కాజల్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ప్రపంచంలో పసివాళ్ళ దగ్గరనుండీ పెద్ద వాళ్ళవరకు చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాక్లెట్ ను ఫుడ్ ఆఫ్ గాడ్స్ అంటూ కాజల్ చాక్లెట్ వల్ల ఉపయోగాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చాక్లెట్ తియ్యని అనుభూతినిస్తుందని , వ్యాకులత ను తొలగిస్తుందని , స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుందని, బ్రెయిన్ లోని కండరాలను ఉత్తేజపరచి హ్యాపీ గా ఉండేలా చేస్తుందని , ఇంకా ఏమైనా రీజన్స్ కావాలా అంటూ కాజల్ ట్వీట్ చేశారు. కాజల్ అభిమానులు చాక్లెట్ డే రోజున తాము ఎంజాయ్ చేసిన చాక్లెట్ ఫొటోలను పోస్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























