నో రెస్ట్ అంటున్న పూరీ..!

Tollywood Ace Director Puri Jagannadh Works Without Break Amid Lockdown

సినిమా షూటింగ్స్, థియేటర్స్ లేకపోవడంతో హీరో, హీరోయిన్స్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఉన్న ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ తమకు నచ్చిన పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అయితే వంటలు, ఆన్లైన్ కోర్సులు, వర్క్ ఔట్స్ ఇలా వారి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఒక డైరెక్టర్ మాత్రం ఈ లాక్ డౌన్ లో నో రెస్ట్ అంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా ..? ఇంకెవరూ టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వల్ల పూరీ ముంబైలోనే లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్యాప్ లో పూరీ తన కెరీర్ పై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అస్సలు రెస్ట్ అనేది తీసుకోకుండా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ టైంలో రెండు పాన్ ఇండియా రేంజ్ స్క్రిప్ట్ లను కూడా రెడీ చేసాడట. అంతేకాదు వాటిని బాలీవుడ్ హీరోలతో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =