అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్

Super Star Mahesh Babu Thanks His Fans On Social Media

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం ప్రారంభంలోనే “సరిలేరు నీకెవ్వరు ” వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ తో మహేష్ బాబు రికార్డ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మహేష్ బాబు , అభిమానులకు అనేక జాగ్రత్తలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను సాధించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సౌత్ ఇండియన్ హీరో మహేష్ బాబు ఒక్కరే. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు ట్విట్టర్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషంగా ఉందని , తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ అని మహేష్ బాబు ట్వీట్ చేసి ఒక ఫోటోను షేర్ చేశారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.