రోబో లుక్ వెనుక సీక్రెట్ బయటపెట్టిన సినిమాటోగ్రాఫ‌ర్..!

Robo Movie Cinematographer Reveals An Interesting Inside Story About Rajinikanth Look In The Movie

రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రోబో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన శంకర్ క్రేజ్ కూడా ఆ తరువాత ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 2010లో విడుదలైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో సైంటిస్ట్ వశీకరన్‌, రోబో చిట్టి పాత్ర‌ల్లో ర‌జినీ న‌ట‌న‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో రోబో 2.0 తీశారు కానీ ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ రిచర్డ్ ఎం తన ట్విట్టర్ ద్వారా రివీల్ చేశారు. రజినీకాంత్ రోబో లుక్‌లో ఉన్న ఫొటోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన రిచ‌ర్డ్ ‘నేను తీసిన ఫొటో ఇది. అందరూ కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌లో ఈ లుక్ ను తీశారు అనుకుంటారు..కానీ అది కాదు.. ఈ షూటింగ్ కోసం ర‌జినీకి సిల్వ‌ర్ రంగు పెయింటింగ్ వేశారు. అంటూ అప్పటి లుక్ వెనుక సీక్రెట్ ను ఇప్పుడు రివీల్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.