యోగ టిప్స్ చెపుతున్న రెబల్ స్టార్..!

Rebel Star Krishnam Raju Gives Yoga Tips

రేపు ప్రపంచ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే కదా. జూన్ 21న ప్రపంచమంతా 6వ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. నిజానికి ప్రతి ఏడు బహిరంగ ప్రదేశాల్లో యోగ డే సెలెబ్రేట్ చేసేవాళ్ళు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈసారి బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధ్యం కాదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఎక్కడివారక్కడే యోగా డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ వీడియోను విడుదల చేశారు. యోగా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, దానికి కొన్ని యోగాసనాలు వేయాలని ఆయన తెలిపారు. ‘‘ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. యోగాని మళ్లీ గుర్తు చేసుకుని, మీ జీవితంలో, మనశ్శాంతితో శరీర ఆరోగ్యంతో హాయిగా ఉండండి. ప్రస్తుతం ఉన్న కరోనా నుంచి తప్పించుకోవడానికి యోగాలోని కొన్ని చెబుతాను. అందలో 1. ప్రాణక్రియ. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 2. కపాలభాతి..’’ అని తెలుపుతూ.. వీటిని ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో కృష్ణంరాజు, ఆయన భార్య సూచించారు. అయితే ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఈ వీడియోలో యోగాసనాలు చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.