మొత్తానికి నిహారిక కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నిన్ననే తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక చేసుకోబోయే చైతన్య అయితే ఒక్కరోజులో ఫేమస్ అయిపోయాడు. అంతేకాదు హీరోకి కాబోయే అన్ని లక్షణాలు ఉన్నాయంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు అందరూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నిహారిక ప్రస్తుతం ఒక తమిళ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళికి ముందే ఈ సినిమాను కంప్లీట్ చేయనుందట. ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతునన్నట్టు తెలుస్తుంది. డెబ్యూ డైరెక్టర్ స్వాతి ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది. జె.సెల్వకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కరోనా లేకపోతే ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. అయితే నిహారిక పెళ్లి వచ్చే ఏడాది అనుకుంటున్నారు కాబట్టి ఆ లోపే సినిమా పూర్తి చేయాలని అనుకుంటుందట. మరి పెళ్లి తర్వాత సమంత సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.




ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. చైతన్య గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఆగష్ట్ నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























