లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఈ సినిమా షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా ఇప్పుడప్పుడే షూటింగ్ లకు వెళ్లే ఆలోచనలో మాత్రం ఎవరికీ లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే.. లాక్ డౌన్ లో సడలింపులు చేయడం.. రోజు రోజుకు కేసులు కూడా పెరగడమే దీనికి కారణం. మరోవైపు షూటింగ్స్ చేయాలంటే పలు నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం షూటింగ్లను మొదలుపెట్టాలని చూస్తున్నారు… కొంతమంది మాత్రం లేట్ అయినా పర్లేదు అని వెనక్కి తగ్గుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా బాలకృష్ణ కూడా తన షూటింగ్ ను వచ్చే ఏడాదే అంటున్నాడు. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ముందు ఈ సినిమా షూటింగ్ ను ఆగష్ట్ లో ప్రారంభించాలనుకున్నారు.. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో వచ్చే ఏడాదే షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారట. ఇక ఇదే విషయాన్ని బోయపాటికి కూడా చెప్పాడట బాలయ్య. ప్రస్తుతం బోయపాటి థమన్ తో మ్యూజిక్ పనుల్లో బిజీగా వున్నాడు. ఇక పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి వచ్చే ఏడాదే వెళ్తారా.. లేక ఆ లోపు పరిస్థితులు చక్కబడితే షూట్ వెళ్తారా.. చూద్దాం ఏం జరుగుతుందో..?
ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































