None Of Us Are Perfect In The Way We Deal With Our Problems In Our Day To Day Life Says Actress Anushka Shetty
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అనుష్క తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. “మనందరం జీవితంలోని సమస్యలను మనకు తెలిసిన విధంగా పరిష్కరించుకుంటాం. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం అంటూ లేవు. మనమెవరం రోడ్ మ్యాప్‌తో పుట్టలేదు. మనందరం పెద్దవో, చిన్నవో బాధలు పడుతుంటాం. కొందరు లోపలే కుమిలిపోతారు. కొందరు సాయం కోసం ఏడుస్తారు. కొందరు నిస్సహాయంగా ఉంటారు. ఇకపై మనం ఇంకా దయతో జీవిద్దాం. ఇతరుల మాటలను విందాం. వారిని ప్రేమిద్దాం. మనమంతా కలిసి ఇంకా ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మనం ఇప్పటికప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం చూపలేకపోవచ్చు. కానీ, చిన్న ప్రయత్నం ఎంతో మార్పు తీసుకొస్తుంది. మార్పు నెమ్మదిగానే మొదలవుతుంద`ని అనుష్క పేర్కొంది”.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
కాగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.