లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోవడంతో తమ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా.. బయటకు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు పలు వీడియోల ద్వారా కనిపిస్తూనే వున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇంతవరకూ కనిపించింది లేదు. దాదాపు రెండు నెలలుగా ఒక్కాసారి కూడా కెమెరా కంటికి చిక్కని ప్రభాస్.. ఇప్పుడు ఫైనల్ గా కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ తాజాగా గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. తాజాగా టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాడు ప్రభాస్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కనీసం ఈ రకంగా అయినా తమ అభిమాన హీరోను చూసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.




ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























