రాజశేఖర్, జీవితలతనయలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో కనిపించబోతున్నారా..? ఇప్పుడు టాలీవుడ్ లో ఈ వార్తలే వినిపిస్తున్నాయి. గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించనుండగా, ఇందులో శివాత్మిక, శివానీ ఇద్దరూ కలిసి నటించనున్నటు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను జీవిత నిర్మించనున్నట్టు కూడా సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉండగా అప్పట్లో శివాని టూ స్టేట్స్ తెలుగు రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. అడవిశేష్, శివానీ కాంబోలో ఫైనల్ చేసిన ఈ ప్రాజెక్టు 2018లో లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లగా..కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. త్వరలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కథానాయికగా నటించనుంది. రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. ఇక శివాత్మికఇప్పటికే దొరసాని చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాలో శివాత్మిక తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























