ఆగష్ట్ లో లాస్ట్ షెడ్యూల్ జ‌రుపుకోనున్న `సీటీమార్`

Tollywood Actor Gopichand Seeti Maar Movie Team Set To Wrap Up Its Last Schedule In August
Tollywood Actor Gopichand Seeti Maar Movie Team Set To Wrap Up Its Last Schedule In August

ప్రస్తుతం హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్ర‌స్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడుఈ సంవ‌త్స‌రంలో మొద‌ల‌యిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా షూటింగ్ లకు ఎలాగూ అనుమతులు వచ్చాయి కాబట్టి.. మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతుంది. ఇక ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ఎంత‌గానో ఎదురు చూస్తున్న గోపిచంద్ అభిమానుల‌కోసం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. అంతేకాదు రేపు అంటే జూన్ 12 గోపిచంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా `సీటీమార్` టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపి ఒక పోస్టర్ ను కూడా విడుద‌ల చేసింది.

కాగా ఈ సినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తుంది. తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.