సాయం చేద్దాం – కాజల్ అగర్వాల్

Kajal Aggarwal requests her fans to help old people

కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయం లో రెండున్నర నెలలపాటు ఇంటికే పరిమితం అయిన ప్రజలు అన్ లాక్ 1.0 తో తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నులయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా పిల్లలు , వృద్ధులు పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే. పిల్లలు , వృద్ధులపై కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో వారిని బయటకు వెళ్ళనీయొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో టాలీవుడ్ ,కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ స్పందించి ప్రతీ ఒక్కరూ తమ ఇంటి చుట్టు పక్కల ఉన్న పెద్దవారికి సాయం చేయాలనే పిలుపునిచ్చారు. తాను ఎప్పుడు బయటకు వెళుతున్నా తన అపార్ట్ మెంట్ పక్కన ఉండే వారిని పలకరించి , వారికి అవసరమైన వస్తువులు తెచ్చిపెడతానని , ఈ పని ఎప్పుడూ చేసేదేనని , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తోటి వారికి సాయం చేసి , వారికి మీరు తోడున్నామనే భరోసా కల్పించండని కాజల్ కోరారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు ” మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.