లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేకపోవడంతో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లకు నిబంధనలతో కూడిన అనుమతులు రావడంతో చిన్నగా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇంకా కొద్దిరోజులు మాత్రం ఇంట్లోనే కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా ఈ లాక్ డౌన్ సెలబ్రిటీస్ కి కలిసొచ్చిందని చెప్పొచ్చు. షూటింగ్స్ , ఓపెనింగ్స్, ఫోటో షూట్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే వారికి కాస్త కుటుంబంతో గడిపే టైమ్ దొరికింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ తమన్నా కూడా ఇప్పుడు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా తమ వీడియోస్ ను, ఫొటోస్ ను.. ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అంతేకాదు.. అప్పుడప్పుడు లైవ్ లకు వచ్చి అభిమానులతో కూడా ముచ్చటిస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా అభిమానులతో ముచ్చటించిన స్పెషల్ సాంగ్స్ చేయడంపై క్లారిటీ ఇచ్చింది. `నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని అంటున్నారు. అలాంటి వారి మాటలు నేను పట్టించుకోను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నా డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం వాటి వల్ల కలుగుతోంది. పైగా వీటి వల్ల గతంలో నేను పనిచేసిన స్టార్స్‌తో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం వస్తోంది. అందుకే నేను స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాన`ని తమన్నా చెప్పింది.
ప్రస్తుతం తమన్న సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. వీటితోపాటు రెండు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























