“RRR” లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్

Actress Shriya Saran To Play A Special Role In SS Rajamouli Magnam Opus RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఇష్టం ” మూవీ తో టాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన శ్రియ శరన్ తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శ్రియ ప్రస్తుతం రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. శ్రియ ఇప్పుడు “RRR” మూవీ లో ఒక ప్రత్యేక పాత్ర కై ఎంపిక అయ్యారు. లాక్ డౌన్ సమయం లో స్పెయిన్ లో ఉన్న శ్రియ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో ఛాటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా అభిమానుల ఛాటింగ్ లో శ్రియ “RRR” మూవీ కి సంతకం చేశాననీ , అజయ్ దేవగన్ కు జోడీగా నటించనున్నాననీ , షూటింగ్ ప్రారంభానికై ఎదురుచూస్తున్నాననీ చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో శ్రియ హీరోయిన్ గా రూపొందిన “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.