గ్రూప్ కంపెనీ బ్యానర్ పై కథిరేసన్ నిర్మాతగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్ , బాబీ సింహా ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “జిగర్తాండ” తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. “జిగర్తాండ” తమిళ మూవీ తెలుగు రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, అథర్వ ప్రధాన పాత్రలలో రూపొందిన “గద్దలకొండ గణేష్”మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు “జిగర్తాండ” తమిళ మూవీ హిందీ లో రీమేక్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథిరేసన్ నిర్మాతగా రూపొందనున్న ఈ రీమేక్ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, ఫర్హాన్ అక్తర్ ప్రధానపాత్రలలో నటించనున్నారు. హీరోయిన్ గా తమన్నా ఎంపిక అయ్యారని సమాచారం. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా “బోలే చూడియా” హిందీ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్” మూవీ లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























