స్క్రిప్ట్ వర్క్ లో బిజీ

Arjun Reddy Director Sandeep Reddy Vanga Gets Busy In Writing New Movie Scripts

“కేడి ” మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ ప్రారంభించిన సందీప్ రెడ్డి వంగ సక్సెస్ ఫుల్ “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” మూవీ కి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ తో సందీప్ దర్శకుడిగా మారారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడు గా “అర్జున్ రెడ్డి “మూవీ ని “కబీర్ సింగ్ “గా సందీప్ హిందీలో రీమేక్ చేశారు. ఆ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. “అర్జున్ రెడ్డి “తమిళ రీమేక్ “ఆదిత్య వర్మ” మూవీకి స్టోరీ ,స్క్రీన్ ప్లే సందీప్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అర్జున్ రెడ్డి ” మూవీ తరువాత సందీప్ దర్శకత్వం లో రూపొందే మూవీ పెండింగ్ లో ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలకు సందీప్ రెడ్డి స్క్రిప్ట్స్ నరేట్ చేశారు. ప్రభాస్, మహేష్ బాబు లకు స్క్రిప్ట్స్ వినిపించినా వర్క్ అవుట్ కాలేదు. సందీప్ రెడ్డి లాక్ డౌన్ సమయంలో పలు స్క్రిప్ట్స్ రెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఆసియన్ ఫిలిమ్స్ అడ్వాన్స్ లు సందీప్ వద్ద ఉన్నాయి. టాప్ యాక్టర్స్ తో మీటింగ్అరేంజ్ చేస్తామని సందీప్ కు నిర్మాతలుచెప్పారు. “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్న హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ రూపొందే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.