లాక్ డౌన్ వల్ల చాలా సినిమాల రిలీజ్ విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక చిన్న సినిమాల సంగతేమో కానీ.. పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం రోజుకో వార్త వస్తూనే వుంది. ఇక ‘కె.జి.ఎఫ్2’ సినిమా రిలీజ్ విషయంలో కూడా గత కొద్ది రోజులుగా ఈ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ఈ విషయంపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా… ఏదో ఒక రూమర్ అయితే వస్తూనే ఉంది. ఇక తాజాగా వచ్చిన రూమర్స్ పై ‘కె.జి.ఎఫ్2’ నిర్మాత కార్తీక్ గౌడ స్పందించి..30 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తయ్యిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జూలైలో ప్రభుత్వం షూటింగ్‌కి అనుమతిచ్చినా అక్టోబర్ 23నే సినిమాను విడుదల చేస్తామని కార్తీకగౌడ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























