మెగా ఫ్యామిలీలో నాగబాబు కూతురు నిహారిక పెళ్లి మ్యాటర్ ఎప్పుడు హాట్ టాపిక్కే. నిహారిక సినిమాల గురించి ఎప్పుడూ రూమర్లు రావు కానీ నిహారిక పెళ్లిపై మాత్రం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో ప్రభాస్ తో పెళ్లి అని.. సాయి తేజ్ తో అని ఇలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఇక ఇటీవలే నిహారిక కూడా త్వరలోనే తన పెళ్లి ఉండబోతున్నట్టు హింట్ కూడా ఇచ్చింది. అసలే తక్కువ టైం ఉందని.. ఆ టైం లో మంచి సినిమాల్లో నటించాలని చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా నాగబాబు కూడా నిహారిక పెళ్లిపై స్పదించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం తనపై ఉందని.. నిహారికకు సంబంధాలు చూస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆమె పెళ్లి జరిపించే అవకాశాలు ఉన్నాయన్నారు.అంతేకాకుండా ఆ వెంటనే వరుణ్ తేజ్ కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన ఉందన్నారు. వచ్చే ఏడాది చివరిలోగానీ .. 2022 ప్రారంభంలో కాని వరుణ్ పెళ్లి జరిపించే ఆలోచన ఉందన్నారు నాగబాబు. ఆ దిశగానే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నామన్నారు. వారిద్దరికీ పెళ్లి చేస్తే నేను కాస్త ఫ్రీ అయిపోతానన్నారు. మరి తొందర్లోనే నిహారిక పెళ్లి ఉంటుందన్న మాట. మరి పెళ్లి తర్వాత నిహారిక సినిమా చేస్తుందో లేదో..!




ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో తమిళ్ లో ఒక సినిమా చేయనుంది. లాక్ డౌన్ అయిన వెంటనే షూటింగ్ లో పాల్గొననుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























