ఒకప్పుడు సినిమా చూడాలంటే చాలాకష్టమయ్యేది. కానీ రాను రాను టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అన్నీ ఈజీ అయిపోయాయి. ఇక ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసే పని కూడా లేకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వల్ల ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. అందుకే సెలెబ్రిటీస్ సైతం డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోలు హీరోయిన్లను సైతం ను వెబ్ సిరీస్ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఎంతో మంది డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ లలో నటించడానికి.. తీయడానికి రెడీ అవ్వగా ఇప్పుడు మరో సీనియర్ డైరెక్టర్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆయనెవరో కాదు తెలుగు తెరకి అపురూప చిత్రాలను అందించిన సీనియర్ డైరెక్టర్ వంశీ. ఆయన కథలు వాస్తవానికి దగ్గరగా .. ఆయన కథల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన కూడా వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేస్తున్నారనేది తాజా సమాచారం. ఇంతకుముందు వంశీ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారాన్ని ‘పొలమారిన జ్ఞాపకాలు’గా రాశారు. వాటిని వెబ్ సిరీస్ గా అందించడానికి సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ వారు వంశీకి భారీ ఆఫర్ ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ వెబ్ సిరీస్ నిర్మాణం మొదలవుతుందని అంటున్నారు. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























