తప్పుడు వార్తలపై విజయ్ ఆగ్రహం – విజయ్ కు మద్దతుగా ఇండస్ట్రీ..!

ఏ విషయాన్నైనా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం రౌడీ హీరో విజయ్ కు మొదటి నుండి అలవాటే. ఆ యాటిట్యూడ్ నచ్చే విజయ్ ను అంతలా ఇష్టపడతారు ఫ్యాన్స్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు కూడా లేక భాదపడుతున్న ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దీనిపై కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు వార్తలు రాశాయి. విజయ్ దేవరకొండ పేద ప్రజలను అవమానిస్తున్నారని.. వెబ్‌సైట్ పెట్టి సాయం చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని అనేక వార్తలు రాశాయి. అంతేకాకుండా విజయ్‌ ఎందుకు విరాళం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూనే, చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్‌ చారిటీ(సీసీసీ)కి పోటీగా మిడిల్‌క్లాస్‌ ఫండ్‌ను విజయ్‌ ప్రారంభించారంటూ సదరు వెబ్‌సైట్స్‌ పేర్కొన్నాయి.

దీనిపై విజయ్ స్పందించి… మిడిల్ క్లాస్ కుటుంబాలను ఆదుకోడానికి ఓ కార్యక్రమం మొదలుపెడితే అందులో కూడా తప్పులు వెతికి తన పేరు నాశనం చేస్తున్నారని.. గత నెల రోజులుగా నాలుగు వెబ్ సైట్లు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాయని, తనపై విపరీతంగా తప్పుడు వార్తలను రాస్తున్నాయని చెప్పాడు. విజయ్ దేవరకొండ ఎక్కడ? ఎక్కడ దాక్కున్నాడు? అంటూ రాస్తున్నాయని అన్నాడు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు రాస్తామని, ప్రకటనలు ఇవ్వకపోతే రేటింగ్స్ తగ్గిస్తామని బెదిరిస్తారని చెప్పాడు. అసలు విరాళాలు అడగడానికి మీరెవరు అని ప్రశ్నించాడు. నాకు ఇవ్వాలనిపించినప్పుడు, ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికి ఇస్తానని చెప్పాడు. తెలంగాణ, ఏపీలో ఎంతో మందికి సాయం చేస్తున్నాం.. ప్రజలు విపరీతంగా విరాళాలను ఇస్తున్నారని… ఇప్పటికి ఆ మొత్తం రూ. 70 లక్షలు దాటిందని చెప్పాడు. తమ కార్యకలాపాలు ప్రతి ఒక్కరికి తెలియాలని వెబ్ పైట్ లో అప్ డేట్స్ ఇస్తున్నామని తెలిపాడు. దాదాపు 21 నిమిషాల వీడియోను షేర్‌ చేసాడు విజయ్.

 


ఇక విజయ్‌ దేవరకొండ విడుదల చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌ అయింది. అంతేకాదు విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్‌ ప్రముఖులు తమ ట్వీట్లతో ముందుకు వచ్చారు. విజయ్‌కి తాను అండగా నిలుస్తానని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు. ఇంకా రానా, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, వంశీపైడిపల్లి, అల్లరి నరేశ్‌, రవితేజ, హరీష్‌ శంకర్, క్రిష్‌‌ తదితరులు విజయ్‌కు సపోర్ట్ గా నిలుస్తూ ట్వీట్లు చేశారు.

 

 

 

 

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.