తెలుగునాట అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది అందాల తార రాశి ఖన్నా. కాగా ఇప్పుడు తమిళ చిత్ర సీమలోనూ అదే దిశగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా రాశి.. ఓ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ చిత్రం మరేదో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తన లక్కీ డైరెక్టర్ హరి రూపొందించనున్న యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ చిత్రం కోసం పలువురు కథానాయికల పేర్లు వినిపించినా.. చివరాఖరికి ఆ అవకాశం రాశి కే దక్కింది. సూర్యతో నటించబోతున్న విషయాన్ని.. అభిమానులతో జరిపిన ట్విట్టర్ చిట్ చాట్ లో వెల్లడించింది రాశి.
అంతేకాదు.. మరో తమిళ చిత్రం ‘అరణ్మనై 3’లోనూ నటిస్తున్నట్టు రాశి తెలిపింది. ఇక తెలుగులో రెండు కొత్త చిత్రాల కు అంగీకారం తెలిపానని, లాక్ డౌన్ అనంతరం ఆ వివరాలు చెబుతానని ముక్తాయించింది.
మరి.. సూర్య, హరి కాంబినేషన్ మూవీతో తమిళనాట కూడా రాశి అగ్రనాయికగా ఎదుగుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: