తమిళ్ సినిమా రూమర్స్ పై నిహారిక క్లారిటీ..!

Actress Niharika Konidela Gives Clarification About Her New Movie Offer With Ashok Selvan
Actress Niharika Konidela Gives Clarification About Her New Movie Offer With Ashok Selvan

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా నిహారిక కు మాత్రం హీరోయిన్ గా ఇంకా నిలదొక్కునే ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పటికీ మంచి సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్ర‌ణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. అయితే గత ఏడాది సైరా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి తమిళ్ లోనే ఛాన్స్ కొట్టేసింది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళుతున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ‘‘తమిళంలో మరో సినిమా చేయబోతున్నాను. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు నిహారిక. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతుందట. మరి ఈ సినిమా అయినా మంచి హిట్ కొట్టి నిహారికకు వరుస ఆఫర్స్ వస్తాయేమో చూద్దాం.

 


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twenty =