ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత ఎంతో యాక్టివ్గా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. కరోనా గురించి అయితేనేం, వ్యక్తిగత విషయాలు అయితేనేం, సినిమా విషయాలు అయితేనేం ఇలా అన్ని విషయాలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్నో విషయాలు తెలిపిన చిరు ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
80లలో హీరో, హీరోయిన్లుగా రాణించిన వాళ్లు ప్రతి యేడాది ఒకసారి కలుసుకుంటూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా అందరూ కలుసుకున్నారు. గత ఏడాది చిరంజీవిగారి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది. ఇక ఈ సందర్భంగా చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధిక, లిజి ప్రియదర్శన్లతో కలసి చిరంజీవి స్టెప్పులేసిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ చేయగా.. కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు వేయగా.. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధలు కూడా స్టెప్పులు వేసారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Fun is meeting friends. Fun is a little dance.
As promised, here is the throwback dance video #80sClub #10thReunion @hasinimani @khushsundar @JSKapoor1234 @ActressRadha @realradikaa#LissyPriyadarshan pic.twitter.com/c4fiHnDMRh— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2020
ఇక గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది..మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































