నవరసభరితంగా మహేష్, పరశురామ్ చిత్రం

Director Parasuram New Movie With Mahesh Babu Going To Be Another Wholesome Family Entertainer

‘గీతగోవిందం’(2018)తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. స్వల్పవిరామం అనంతరం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారాయన‌. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్.. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ చిత్రంపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు పరశురామ్. తన సినిమాలో కనిపించే మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు.. మహేష్ చిత్రంలో కూడా ఉంటాయని, నవరసభరితంగా త‌మ కాంబినేష‌న్ మూవీ ఉంటుంద‌ని పరశురామ్ వెల్లడించాడు. అంతేకాదు.. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా తనకు ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ అని ముక్తాయించాడు.

మరి, 2021 ప్రథమార్థంలో తెరపైకి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పరశురామ్ కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.