ఇంటర్నేషనల్ క్రికెటర్స్ రవిచంద్రన్ అశ్విన్ (తమిళనాడు ), హనుమ విహారి (ఆంధ్ర ప్రదేశ్ ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు మూవీస్ గురించి చర్చించారు. తెలుగు లో మీ ఫేవరేట్ మూవీ అని అశ్విన్ అడగగా ఇటీవలే ఒక మంచి కామెడీ మూవీ “భీష్మ ” చూశానని, నితిన్ హీరో అని విహారి బదులిచ్చారు. అశ్విన్ మాట్లాడుతూ .. తెలుగు మూవీస్ కు పెద్ద ఫ్యాన్ అని, అద్భుతమైన సినిమాలు చూశానని, తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ “మగధీర “అని, ఈ మధ్య చూసిన సినిమాలలో “ఎవరు ” మూవీ చాలా బాగుందని, మహేష్ బాబు ఫ్యాన్ ను అని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




చెన్నై లో క్రికెట్ ఆడారు కదా తమిళ భాష తెలుసునా అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు అర్థం అవుతుంది కానీ మాట్లాడలేనని విహారి చెప్పారు. తెలుగు సినిమాలకు క్రేజ్ ఉంది, హీరోలు లేదా ప్రేక్షకుల వల్ల వచ్చిందా అని అశ్విన్ అడిగితే ప్రేక్షకులే అనుకుంటున్నానని, ఇక్కడి ప్రేక్షకులు డై హార్డ్ ఫ్యాన్స్ అని టాలీవుడ్ చాలా పెద్ద పరిశ్రమ అని విహారి బదులిచ్చారు. మహేష్ బాబు ఎంత పెద్ద హీరో అని అశ్విన్ అడిగితే ఆయన సూపర్ స్టార్ అని , మీరు మహేష్ బాబు ఫ్యాన్ అని అర్ధమయింది విహారి అన్నారు. అవును చాలా పెద్ద ఫ్యాన్ ని , రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో మహేష్ బాబు మూవీ చూశానని టైటిల్ పలకడం కష్టమని ఆశ్విన్ అనగానే విహారి అందుకుని “సరిలేరు నీకెవ్వరు ” అని, ఆ టైటిల్ కు అర్ధం నీ కన్నా ఎవరూ ఎక్కువ కాదు అని విహారి చెప్పారు. విజయ్ దేవరకొండ గురించి అశ్విన్ అడిగితే ఆయన డీసెంట్ యాక్టర్ అని , యూత్ ఫేవరేట్ గా చెప్పవచ్చని, అటువంటి పాత్రలలోనే విజయ్ నటిస్తున్నారని విహారి చెప్పారు. “గీత గోవిందం ” మూవీ నచ్చిందా అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు తనకు నచ్చిందని , మంచి సినిమా అని విహారి చెప్పారు. ఇలా ఇద్దరి క్రికెటర్స్ మధ్య సినిమాల గురించి తెలుగు లో సంభాషణ జరగడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























