ఒక హీరోయిన్ కు బోల్డ్ సన్నివేశాల్లో నటించాలంటే ఎంత కష్టమో నటించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. మొదటి నుండి ఆ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కు అయితే అది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ పద్దతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది హీరోయిన్స్ వుంటారు.. మొదటినుండి కాస్త గ్లామర్ రోల్స్ కు తక్కువగా.. బోల్డ్ సన్నివేశాలకు దూరంగా. అలాంటి హీరోయిన్స్ కు మాత్రం ఇది కష్టమే అని చెప్పొచ్చు. అలా ఇన్ని రోజులు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న రాశీ ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అలాంటి సన్నివేశాల్లో నటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ సన్నివేశాల్లో నటించడంపై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూ లో రాశీ ఖన్నా ఈ సినిమాపై మాట్లాడుతూ ఇంటిమేట్ సీన్స్ లో నటించడం చాలా కష్టం. అందుకు గట్స్ కావాలి అని రాశి తెలిపింది. మద్రాస్ కేఫ్ లో ఓ ఇంటిమేట్ సీన్ లో నటించా. అప్పుడు నేను చాలా యంగ్ ఏజ్ లో ఉన్నా.. ఆ సన్నివేశం నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో నాకు మాత్రమే తెలుసు…ఆ సీన్ తర్వాత నేను ఏడ్చేసా…ఇప్పటికీ భయం ఉంది కానీ.. కొంత మెచ్యూరిటీ వచ్చింది. అయితే ఆ సినిమా తరువాతఎంత నా సినిమా అయినా నా లిమిట్స్ నేను క్రాస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని చెప్పింది. ఇప్పటివరకూ అలానే చేసుకుంటూ వచ్చా.. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నా లిమిట్స్ నేను క్రాస్ చేయాల్సి వచ్చింది అని రాశి తెలిపింది. ఆ సినిమా టైం లో విజయ్ దేవరకొండ నాకు ఒకే ఒక్క మాట చెప్పాడు. నాకు ఆల్రెడీ ఇలాంటి ఇమేజ్ ఉంది. కానీ నీకు ఇది కొత్త.. నీకు ఇవ్వగలిగినంత సపోర్ట్ నా నుంచి ఉంటుంది అని విజయ్ చెప్పాడు. అలా ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లో చేశా.. కానీ ఆ తర్వాత ఇలాంటివి అవసరమా అని అనుకున్నా అని చెప్పింది. మరి ఎంతైనా తన క్యూట్ నటనతో ఆకట్టుకునే రాశీ ఖన్నా ను ఇలాంటి పాత్రల్లో చూడటం కష్టమే..
ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజు పండగే సినిమాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకోగా…ఈ ఏడాది తాను నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీ గా వుంది ఈ భామ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























