హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ మాత్రం ఇప్పటి వరకూ కాలేదు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాపై పలు రూమర్లు కూడా వచ్చాయి. ఇక ఆ రూముర్లను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వున్నారు చిత్రయూనిట్. కానీ రూమర్లను ఆపడం అనేది ఒక్కరివల్ల అయ్యేపని కాదు కదా. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఈ సినిమాకి సరిగ్గా సహకరించడంలేదని పలు కథనాలు వెలువడ్డాయి. దీనితో మరోసారి చిత్రయూనిట్ ముందుకొచ్చి వార్తల్లో నిజం లేదని చెప్పేసింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఈ సినిమా పై వస్తోన్న రూమర్స్ నమ్మకండి.. ముఖ్యంగా అనుష్కగారి మీద వస్తోన్న రూమర్స్… అవి పూర్తి అవాస్తవం.. వాటిని నమ్మకండి’ అని స్పష్టం చేసింది. పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
Please do not believe in any baseless rumours you come across. 😊 #Nishabdham#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @hemantmadhukar #TGVishwaprasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl @MangoMusicLabel @nishabdham pic.twitter.com/q7fFaIVBUr
— People Media Factory (@peoplemediafcy) April 21, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































