స్టార్ హీరోలతో ఇంటి పని చేయిస్తున్న ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్

Be The Real Man Challenge Makes Star Heroes Do Household Chores
Be The Real Man Challenge Makes Star Heroes Do Household Chores

ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తుంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు స్టార్ హీరోల వరకూ వెళ్ళింది. సందీప్ వంగా మొదట ఈ ఛాలెంజ్ ను దర్శకుడు రాజమౌళి కి విసరగా.. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఆ ఛాలెంజ్ ను కాస్త తారక్, రామ్ చరణ్‌లకు విసిరిన విషయం తెలిసిందే. దీంతో ఈ సవాలును స్వీకరించిన ఎన్టీఆర్‌ తన ఇంట్లో అంట్లు శుభ్రం చేస్తూ, ఇంటి ముందున్న చెత్తను ఊడ్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసాడు. ఇదిగో సవాలు స్వీకరించాను జక్కన్న రాజమౌళి అంటూ తారక్ ట్వీట్ చేశాడు. ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. వర్క్‌ లోడ్‌ను షేర్‌ చేసుకోవడం ఫన్‌గా ఉంటుంది’ అని పేర్కొన్నాడు. అంతేకాదు ‘బాబాయి, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేశ్ గారు, కొరటాల శివ గారికి ఈ సవాలు విసురుతున్నాను’ అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.

 


ఇక రామ్ చరణ్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు. బట్టలు క్లీనింగ్, ఇంటిని శుభ్రం చేసి.. మొక్కలకు నీళ్లు పోసి ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. ఇక తాను చేసిన వీడియో ను పోస్ట్ చేసి మీ ఛాలెంజ్ ను చేసేసా రాజమౌళి సర్… ఆడవాళ్లు చేసే పనిని మనం కూడా పంచుకొని రియల్ మేన్ లా ఉందాం.. ఇక నేను ఈ ఛాలెంజ్ ను త్రివిక్రమ్ గారు, రణవీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్ కు విసురుతున్నా అని తెలిపాడు. మరి చూద్దాం వారు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటారో?లేదో?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.