బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ తో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”మూవీ 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత తన దర్శకత్వంలో రూపొందే మూవీ ని రాజమౌళి అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లేటెస్ట్ ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ ..” RRR” మూవీ తరువాత మహేష్ బాబు హీరో గా మూవీ రూపొందించనున్నానని రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ కై ఎంతో కాలం గా ఎదురుచూస్తున్న ప్రేక్షక, అభిమానులకు రాజమౌళి అనౌన్స్ మెంట్ అమితానందం కలిగించింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందే మూవీ వార్త టాక్ ఆఫ్ ది గా నిలిచింది. రాజమౌళి మాట్లాడుతూ .. ” RRR” మూవీ అనుకున్న డేట్ కే రిలీజ్ కానుందని, మహేష్ బాబు తో రూపొందించే మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఈ మూవీ షూటింగ్ 2021 సంవత్సరం సెకండాఫ్ లో ప్రారంభం కానుందని రాజమౌళితెలిపారు. ఈ వార్త అభిమానులకు శుభవార్తే కదా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























