తెలుగు సినీ కార్మికులకు ‘బిగ్ బీ’ సాయం.. చిరు బిగ్ థ్యాంక్స్..!

Bollywood Actor Amitabh Bachchan Offers Redeemable Grocery Coupons To Daily Wage Workers
Bollywood Actor Amitabh Bachchan Offers Redeemable Grocery Coupons To Daily Wage Workers

కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా… మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతుంటే.. కొంతమంది ఊర్లనే దత్తత తీసుకొని సాయం చేయనకి పెద్ద మనసుతో వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా సినీ కార్మికుల కోసం ఇప్పటికే చిరు కరోనా వైరస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినీ కార్మికులకు అండగా ఇప్పుడు బిగ్ బీ కూడా ముందుకొచ్చి భారీ సాయాన్ని అందించారు. ఈ విషయాన్ని చిరు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ అమితాబ్ పై ప్రశంసలు కురిపించారు. సినీ కార్మికుల కోసం అమితాబ్ బచ్చన్ రూ. 1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్ ఓచర్లను పంపించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి, “అమితాబ్ గారు, ఒక్కొక్కటి రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయనున్నాము. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ‘బిగ్ బీ’కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు” అని తెలిపారు.

 

మరి అక్కడి సినీ కార్మికుల కోసమే కాకుండా మన తెలుగు వాళ్ళ కోసం కూడా పంపించారంటే గొప్ప విషయమే కదా. ఈ రకంగా భాషలు వేరైనా సినీ పరిశ్రమ మొత్తం ఒక్కటే అని మరోసారి రుజువు చేశారు బిగ్ బి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.