మే 20.. యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్ డే. ఎందుకంటే.. ఆ రోజు తారక్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. అలాంటి రోజున తారక్ నుంచి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. తన లక్కీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తారక్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో చరిత్ర పురుషుడు కొమరం భీమ్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు తారక్. కాగా, ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని యన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందట యూనిట్. అలాగే ‘అరవింద సమేత’ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించనున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా అదే రోజున రిలీజయ్యే అవకాశముందని టాక్.
మొత్తమ్మీద.. తన పుట్టినరోజున అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడన్నమాట యంగ్ టైగర్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































