యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ (‘రౌద్రం రణం రుధిరం’). వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్‌లో కొమరం భీమ్‌గా తారక్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. తొలుత 2020 జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా, ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడనున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఆ వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ కారణంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణలో మరింత జాప్యం చోటు చేసుకోనుంది. తద్వారా నిర్మాణానంతర కార్యక్రమాల (ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్) పై కూడా ఆ ప్రభావం పడనుంది. దీంతో ముందు అనుకున్నట్టుగా 2021 సంక్రాంతికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే.. రాజమౌళి గత చిత్రం `బాహుబలి: ది కంక్లూజన్` రిలీజ్ డేట్‌కి అంటే ఏప్రిల్ 28కి ‘ఆర్ ఆర్ ఆర్’ను విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దర్శకనిర్మాతలున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























