మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ… తెలుగునాట ఈ ఇద్దరు అగ్ర కథానాయకులకు ఉన్న క్రేజే వేరు. వీరు నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే అభిమానులకు మాత్రమే కాదు బాక్సాఫీస్ కి కూడా పండగే. అంతటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు… తమ తమ అప్కమింగ్ మూవీస్తో ఒకే రోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సోషల్ డ్రామా `ఆచార్య` ఆగస్టు నెలాఖరులో విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే… సరిగ్గా ఆ సినిమా విడుదల రోజునే బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న చిత్రం కూడా రిలీజ్ కానున్నట్లు తెలిసింది.
కాగా… చిరు, బాలయ్య ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో దిగడం ఇదే తొలిసారి కాదు. మరీ ముఖ్యంగా.. సంక్రాంతి బరిలో పలు సందర్భాల్లో ఒకే రోజున చిరు, బాలయ్య పోటీపడిన వైనాలు ఉన్నాయి. అలాగే ఇద్దరూ విజయాలు అందుకున్న సందర్భాలూ ఉన్నాయి.
త్వరలోనే చిరు, బాలయ్య కొత్త చిత్రాల విడుదల తేదిలపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: