ఈ సంక్రాంతికి విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కథానాయకుడిగా తనకది 26వ చిత్రం. కాగా, తన 27వ సినిమాని `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడట మహేష్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని జీఎంబి ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కాగా, జూలై నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2021 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు… మే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్. మరి.. మహేష్, పరశురామ్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























