`అల్లుడు అదుర్స్`లో నిధి అగ‌ర్వాల్ ప్ర‌త్యేక గీతం?

Nidhhi Agerwal Will Be Seen In A Special Song In Bellamkonda Sreenivas Alludu Adhurs

గ‌త ఏడాది `రాక్ష‌సుడు`తో ప‌ల‌క‌రించిన‌ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్… ఈ వేస‌విలో `అల్లుడు అదుర్స్` అంటూ సంద‌డి చేయ‌నున్నాడు. `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… క‌థ రీత్యా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ ప్ర‌త్యేక గీతానికి స్థాన‌ముంద‌ని… అందులో మ‌రో `ఇస్మార్ట్` గాళ్ నిధి అగ‌ర్వాల్ ద‌ర్శ‌న‌మిస్తుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే నిధి అగ‌ర్వాల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి… `ఇస్మార్ట్` పోరీల‌తో సంద‌డి చేయ‌నున్న ఈ `అల్లుడు శీను`.. `అదుర్స్` అన‌ద‌గ్గ ఫ‌లితాన్ని అందుకుంటాడేమో చూడాలి.

కాగా, ఏప్రిల్ 30న `అల్లుడు అదుర్స్`ని విడుద‌ల చేయాల‌ని ఫిల్మ్ మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.