`మాస్ట‌ర్`లో రెండు విభిన్న పాత్ర‌ల్లో విజ‌య్

Thalapathy Vijay To Play Dual Role For Master

గ‌త ఏడాది దీపావ‌ళికి విడుద‌లైన `ఖైదీ` చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ విజ‌య్ కాంబినేష‌న్ లో రూపొందిస్తున్నాడు. `మాస్ట‌ర్` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో ఒక పాత్ర కోసం కాలేజ్ ప్రొఫెస‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న విజ‌య్.. మ‌రో పాత్ర కోసం మాఫియా డాన్ గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. కాగా, ఈ రెండు పాత్ర‌ల్లోనూ విజ‌య్ న‌ట‌న గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని అంటున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్ నాయిక‌గా న‌టిస్తున్న `మాస్ట‌ర్`… త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో వేస‌వి కానుక‌గా విడుద‌ల కానుంది. మ‌రి.. `ఖైదీ` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న లోకేష్… `మాస్ట‌ర్`తోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.