మ‌రోసారి సాయితేజ్ కి జోడీగా రాశీఖ‌న్నా?

Raashi Khanna To Pair Up With Sai Tej Once Again For A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Raashi Khanna,Sai Tej,Sai Tej New Movie With Raashi Khanna,Sai Tej Upcoming Film With Raashi Khanna

యంగ్ హీరో సాయితేజ్ కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో రాశీఖ‌న్నా ఒక‌రు. `సుప్రీమ్`, `ప్ర‌తి రోజూ పండ‌గే` చిత్రాల్లో ఈ జోడీ క‌నువిందు చేసింది. క‌ట్ చేస్తే.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… సాయితేజ్ క‌థానాయ‌కుడిగా `ప్ర‌స్థానం` ఫేమ్ దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది. కాగా, ఇందులో ఒక క‌థానాయిక‌గా నివేదా పెతురాజ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇందులో మ‌రో నాయిక‌కు కూడా స్థాన‌ముంద‌ని, ఆ పాత్ర‌లో రాశీఖ‌న్నా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. `సుప్రీమ్`, `ప్ర‌తి రోజూ పండ‌గే`తో విజ‌యాలు అందుకున్న తేజ్, రాశి.. రాబోయే చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.