బ్లాక్ బస్టర్ తమిళ మూవీ “బిగిల్ ” లో నటించిన అమృత అయ్యర్ “30 రోజుల్లో ప్రేమించటం ఎలా ?” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న ఆ మూవీ మార్చి 25 వతేదీ రిలీజ్ కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న “రెడ్ ” మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా అమృత ఎంపిక అయ్యారు. ఇప్పుడు మరో మూవీ కి అమృత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాతగా నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అమృత కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమా ఆఫర్స్ అమృత అందుకొనడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























