శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా” మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హెబ్బా పటేల్, వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు చిత్ర యూనిట్ ఒక కొత్త పబ్లిసిటీ కి తెర తీశారు. అదే మొబైల్ పబ్లిసిటీ. ప్రత్యేకంగా LED స్క్రీన్స్ ఏర్పాటు చేసిన వాహనాలు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ మూవీ ని పబ్లిసిటీ చేస్తాయి. ఈ వాహనాలను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. “ఒరేయ్ బుజ్జిగా” మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, మొబైల్ పబ్లిసిటీ అనేది ఒక కొత్త ఆలోచన అని, పబ్లిసిటీ కి ఒక కొత్త టెక్నాలజీ ప్రారంభించిన మూవీ టీమ్ కు శుభాకాంక్షలు అని, “ఒరేయ్ బుజ్జిగా” మూవీ ఘనవిజయం సాధించాలని మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























