సినీ పరిశ్రమలో లక్ అనేది అందరికీ కలిసి రాదు. అలా అని కేవలం లక్ మాత్రమే ఉంటే సరిపోదు కదా. హార్డ్ వర్క్ ఉండాలి.. దానికి తోడు కొంచెం లక్ ఉంటే చాలు సక్సెస్ అయినట్టే. అలా మంచి నిర్మాణ విలువలతో తక్కువ కాలంలోనే మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ…విజయాలు సాధిస్తూ..అటు ఆడియన్స్ లోను, ఇటు ఇండస్ట్రీలోను అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, లాంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు నిర్మించి అభిరుచి గల నిర్మాణ సంస్థగా.. మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. ఇక రీసెంట్ గా సమంత ముఖ్యపాత్రలో ‘ఓ బేబి’, వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ చిత్రాల్ని నిర్మించి మంచి హిట్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మించారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డారీన్ బ్రావో తో , తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ’ లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను కూడా నిర్మించింది.
ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టి కేవలం రెండేళ్లు మాత్రమే అవుతున్నా అప్పటినుండి ఇప్పటివరకూ ఎలాంటి బ్రేక్స్ లేకుండా.. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే వున్నారు. ప్రతి ఒక్క కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటూ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ ఏడాది చాలా సినిమాలనే లైన్ లో పెట్టారు.




* హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో… మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు .
* పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా తెరకెక్కుతుంది.
* నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
* నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా ఈ బ్యానర్ పైనే వస్తుంది.
* డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా ఎ1 ఎక్స్‌ప్రెస్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా నిర్మిస్తున్నారు.
* శ్రీధర్ సీపాన దర్సకత్వంలో కళ్యాణ్‌దేవ్ హీరోగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లలో టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి డిఫరెంట్ స్టోరీసే. మరి ముందు ముందు కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి నాన్ స్టాప్ గా ఇలాగే సినిమాలు రావాలని.. హిట్స్.. సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోవాలని కోరుకుందాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























