‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా హిట్ అయితే అయింది కానీ రీతూ వర్మకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. అక్కడ అమ్మడికి బాగానే అవకాశాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే మలయాళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’లో నటిస్తోంది. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌కు ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈనెల 28న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటీకే ఈ సినిమా నుండి టీజర్, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
[custom_ad]
దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ తెలుగు హక్కులను దక్కించుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: