శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కానుకగా మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, నాని ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “V” మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. టీజర్ లోని విజువల్స్ థ్రిల్లింగ్ గా ఉండి , మూవీ పై అంచనాలను పెంచాయి. హీరో నాని తన 26వ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: