‘ప్రెషర్ కుక్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

Pressure Cooker Movie Pre Release Event Venue Gets Fixed

సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా రూపొందుతున్న సినిమా ‘ప్రెషర్ కుక్కర్’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా… సినిమాపై భారీ అంచనాలే పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లోని దస్పల్లా హోటల్ లో సాయంత్రం 7 గంటల నుండి ఈ వేడుక ప్రారంభంకానుంది.

[custom_ad]

కాగా ఇంకా ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, రాజై రోవన్, తనికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు, సంగీత, ప్రభావతి, ఝాన్సీ, రవివర్మ, కిరీటి, లావణ్యారెడ్డి నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో, కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా కి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 21న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eleven =