చందు ముద్దు నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ.. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ పిట్ట కథ’. ఒక విలేజ్లో జరిగే స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ప్రీ టీజర్ విడుదల చేయగా.. ఇప్పుడు టీజర్ ను టీజర్ ను రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా ట్విట్టర్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]



ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























